Namaste NRI

జపాన్ కు చేదు అనుభవం

అంతరిక్ష పరిశోధనల్లో జపాన్ కు చేదు అనుభవం ఎదురైంది. హెచ్3 రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో ఆ దేశం దాన్ని పేల్చివేసింది. తనగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఎగిరిన తర్వాత ఆ రాకెట్‌లో  రెండో దశలో ఇగ్నిషన్ కాలేదు. మిషన్ సక్సెస్ కాలేదని గ్రహించిన శాస్త్రవేత్తలు ఆ రాకెట్‌ను  పేల్చేశారు. రాకెట్ ప్రయోగం విఫలం కావడం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేష‌న్  ఏజెన్సీ కి పెద్ద జట్కా తగిలినట్లు అయ్యింది. అతి తక్కువ ఖర్చుతో హెచ్3 రాకెట్‌ను జపాన్ డెవలప్ చేసింది. ఆ రాకెట్ ఎత్తు 57 మీటర్లు. నిజానికి గత నెలలోనే ఆ రాకెట్ ఎగరాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల దాన్ని పోస్టుపోన్ చేశారు.  నింగిలోకి ఎగిరిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇంజిన్ విఫలం కావడంతో రాకెట్లో ఇగ్నిషన్ కాలేదు. దీంతో మిషన్ అధికారులు మాన్యువ‌ల్‌గా  ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. డిస్ట్రక్ట్ కమాండ్ తో దాన్ని పేల్చివేశారు. డేటాను పరిశీలించిన తర్వాత ఏం జరిగిందో చెబుతామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events