Namaste NRI

ఈ నెల 20న కొత్త భవనంలోకి యూఎస్ కాన్సులేట్

అమెరికా కాన్సులేట్ కార్యాలయం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో నిర్మించిన నూతన భవనంలోకి మారనున్నది. నూతన కార్యాలయాన్ని ఈ నెల 20న ఉదయం 8. 30 గంటలకు అట్టహాసంగా ప్రారంభించనున్నట్టు కాన్సులేట్ తెలిపింది. ఈ భవనాన్ని 34 కోట్ల డాలర్లు (దాదాపు రూ.2,785కోట్లు) వెచ్చించి అత్యాధునిక వసతులతో నిర్మించినట్టు పేర్కొన్నది. ఇది భారత్-అమెరికా మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పింది. ఈ మార్పు నేపథ్యంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో ఉన్న ఆఫీస్ కార్యకలాపాలను ఈ నెల 15 మధ్యాహ్నం 12 నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ సమయంలో అమెరికా పౌరులెవరైనా అత్యవసర సేవలు పొందాలనుకుంటే +9140   40338300 నెంబర్‌పై  కాల్ చేయాలని సూచించారు. కొత్త కార్యాలయం ప్రారంభమైన తర్వాత +9140  69328000 నెంబర్‌పై  సంప్రదించాలి.  మార్చి 20 ఉదయం 8.30 గంటలకు కాన్సులేట్ను మూసివేస్తున్నట్టు వెల్లడించింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events