Namaste NRI

అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా మూడో కన్ను

సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మూడో కన్ను. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, కృష్ణమోహన్, మావిటిసాయి సురేంద్రబాబు అనే నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కథలో ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ నాలుగు కథలు, నలుగురు దర్శకులు, కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడానికి ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ నాలుగు కథలు, నలుగురు దర్శకులు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. ప్రతి కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా మా ఈ ప్రయోగం కమర్షియల్‌గా  సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.  షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌లో  ఉన్న మా చిత్రాన్ని ఏప్రిల్‌లో  రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.  నిరోష, కౌశిక్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వర.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress