భారత పర్యటలనో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారతీయ విద్యార్ధులకు తీపి కబురు అందించారు. ఆస్ట్రేలియా భారతీయ డిగ్రీలకు గుర్తింపు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. భారత్‌లో చేసిన డిగ్రీలను తమ దేశంలోనూ గుర్తిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. ఇరుదేశాల విద్యార్థులకు మేలు కలిగేలా ఆసీస్-ఇండియా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ మెకానిజం ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆస్ర్టేలియాకు చెందిన డీకిన్ యూనివర్శిటీ బ్రాంచీని గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.