రవితేజ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ మూవీ రావణాసుర. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. ఈ చిత్రంలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు
ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ ప్రేక్షకులను అలరించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో క్యూరియాసిటీని పెంచింది. రవితేజని ఈ టీజర్ డిఫరెంట్ షేడ్స్‌లో చూపుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రోజు మూడో పాటను విడుదల చేశారు. వెయ్యిన్కొక్క జిల్లాల వరకు అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి కంపోజిషన్‌తో పాత పాటకు కొత్తరూపం తీసుకొచ్చారు. రెట్రో స్టయిల్లో సాగే ఈ పాట విక్టరీ వెంకటేష్ నటించిన సూర్య IPS లోని సూపర్‌హిట్ సాంగ్ వెయ్యిన్కొక్క జిల్లాల వరకు కు రీమిక్స్ వెర్షన్. అప్పట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను ఇళయరాజా కంపోజిషన్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. కొత్తపాటలో కొన్ని ఫాస్ట్ బీట్స్, రవితేజ క్రేజీ డ్యాన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్‌గా రావణాసుర గ్రాండ్ రిలీజ్ కానుంది.