అమెరికాలోని టెన్నెస్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్నెస్సీ రాష్ట్రంలోని ప్లెసెంట్ వ్యూ, స్ప్రింగ్‌ఫీల్డ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ఏడేండ్ల చిన్నారి సహా ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయడప్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 1-18 ఏండ్ల వయస్సుగల ఐదుగురు బాలికలు, ఓ మహిళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో హైవేపై అధికారులు ట్రాఫిక్‌ను కొన్ని గంటలపాటు నిలిపివేశారు.