Namaste NRI

కువైత్ లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కువైత్ లో   తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కువైత్‌లో హవల్లి ప్రాంతములో ఎన్నారై తెలుగుదేశం కువైత్ కార్యవర్గం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.  అనతరం కేక్ కటింగ్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియచేసుకున్నారు.  ఈ సంధర్బంగా గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ అన్న స్వర్గీయ నందమూరి తారక రామరావు సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే ధ్యేయంగా పాలన సాగించారని కొనియాడారు.   ఏడేళ్ల పాలనలో అన్న నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఆ తరువాత పార్టీ పగ్గాలను చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కాలంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఇటు విడిపోయిన స్వర్ణాంద్ర ప్రదేశ్‌ను అభివృద్ది పదంలోకి తీసుకువెళ్లారన్నారు. విజన్ 2020 ని తెచ్చి ఐటీ రంగాన్ని ప్రగతి పథంలోకి నడిపించారని, దీని ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. బీసీల సంక్షేమానికి ఎన్టీఆర్, చంద్రబాబు పెద్దపీట వేశారని కొనియాడరు.

ఈ కార్యక్రమములో ఎన్నారై టీడీపీ కువైత్ కార్యవర్గం ప్రధాన కార్యదర్శి వేగి వెంకటెష్ నాయుడు, కోశాధికారి నరసింహా నాయుడు, అహ్మది గవర్నరేట్ కోఆర్డినేటర్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, మైనార్టీ నాయకుడు చాన్ బాషా, బీసీ విభాగం అధ్యక్షుడు రమణ యాదవ్, టీడీపీ నాయకులు చుండు బాలరెడ్డయ్య, గూదే శంకర్, చిన్న రాజు, నరసింహులు, శివ మద్దిపట్ల, సురేష్, సూర్యనారాయణ, తిరుపతి నాగేశ్వర్, తదితరులు పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు. ఈ సంబరాల్లో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events