ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి తిరుమూర్తి స్వీకరించారు. జులై నెలలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఫ్రాన్స్ నుంచి తిరుమూర్తి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఐరాస భద్రతా మండలిలో నెలకొక దేశం చొప్పున బాధ్యతల నిర్వహణ చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు అధ్యక్ష బాధ్యతలను చేపడుతుండడం గమనార్హం. 2021`22 ఏడాదికి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైన విషయం విదితమే. వచ్చే ఏడాది డిసెంబర్‌లో కూడా భారత్ మరోమారు అధ్యక్ష బాధ్యతలను చేపట్టనుంది.