Namaste NRI

స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు  

స్విట్జర్లాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యూరిచ్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ సంప్రదాయాలను కాపాడేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల ఆటపాటలతో ఉగాది వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో చిదంబరేశ్వర పాఠశాలకు చెందిన 23 మంది చిన్నారులు ప్రదర్శించిన భరత నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఉగాది వేడుకలో సాయికృష్ణ, ప్రవీణ్ గౌతమ్, రాయ్, గీతా విజయ్ వంటి గాయకులు చాలా ఉల్లాసంగా తెలుగు పాటలు (కరోకే) పాడారు. ఉగాది పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన కార్యక్రమం డీజేతో ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో  స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గనికాంబ కడలి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ దుర్గారావు కరంకి, కోశాధికారి మాధురి ముళ్లపూడి, సాంస్కృతిక కార్యదర్శి మాణిక్యవల్లి చాగంటి, క్రీడా కార్యదర్శి రామచంద్ర వుట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన‌ 300 మంది పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events