అమెజాన్‌లో పని చేస్తున్న 27 వేల మంది ఉద్యోగులను తొలగించడం కష్టంగా ఉన్నా తప్పలేదని, ఇది సంస్థకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందని ఆ సంస్థ సీఈవో ఆండీ జస్సీ పేర్కొన్నారు. అమెజాన్ షేర్‌హోల్డర్లకు లేఖ రాశారు. ఖర్చులు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు సంస్థ వృద్ధికి దోహదపడతాయన్నారు. కంపెనీకి చెందిన ప్రతి వ్యాపారంపై సమీక్ష నిర్వహించామని, దీని ఆధారంగానే బుక్‌స్టోర్లు, 4స్టార్ హోటళ్లు మూసివేయడానికి, అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ప్రయత్నాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కాగా, ఖర్చులు తగ్గించుకునేందుకుగానూ ఇటీవల అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను ఒకసారి, 9 వేల మందిని మరోసారి తొలగించిన సంగతి తెలిసిందే.