అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మిలటరీ కేంద్ర కార్యాలయం పెంటగాన్ వద్ద కాల్పుల కలకలం రేగింది. పెంటగాన్ ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం. పోలీసు అధికారి ఒకరు కత్తిపోట్లకు గురై మరణించారు. ఈ ఘటనకు, కాల్పులకు సబంధం ఏమిటనే విషయంపై విచారణ చేస్తున్నారు. ఈ అలజడితో పెంటగాన్‌ను తాత్కాలికంగా మూసివేసి, రాకపోకలను నిషేధించారు. ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. పెంటగాన్ రవాణా కేంద్రంలో భాగమైన మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని బస్ ప్లాట్‌ఫాం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. ఇది పెంటగాన్ కార్యాలయానికి కొన్ని అడుగుల దూరంలో
ఉంటుంది. ముందు కొన్ని రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. తర్వాత కాల్పులు కొద్దిసేపు ఆగిపోయాయి. అయితే హై సెక్యూరిటీ జోన్‌లోని పెంటగాన్‌లో అసలేం జరిగిందనే అధికారిక ప్రకటన వెలువడలేదు.