Namaste NRI

2024 అధ్య‌క్ష ఎన్నిక‌లపై జో బైడెన్ క్లారిటీ

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్  మ‌రోసారి అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌నున్న విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న ముగించుకుని వెళ్లే ముందు ఆయ‌న దీనిపై క్లారిటీ ఇచ్చారు. 2024లో మ‌ళ్లీ అధ్య‌క్ష ఎన్నిక బ‌రిలో ఉండాల‌న్న ప్లాన్ త‌న‌కు ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే వ‌చ్చే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేనిదీ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు బైడెన్ పేర్కొన్నారు.

80 ఏళ్ల బైడెన్ పూర్వీకులది ఐర్లాండ్‌. క్యాథ‌లిక్ క్రైస్త‌వ కుటుంబానికి చెందిన ఆయ‌న, పూర్వీకులు నివ‌సించిన ప్ర‌దేశాన్ని విజిట్ చేశారు. బ‌ల్లినా ప‌ట్ట‌ణంలో ఉన్న సెయింట్ మురెడాక్ చ‌ర్చిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. 1828లో బైడెన్ పూర్వీకులు ఆ చ‌ర్చికు ఇటుక‌లు అందించిన‌ట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News