సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విమానం. శివప్రసాద్ యానాల దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇందులో సముద్రఖని అంగవైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్యలేకపోయినా కొడుకును జాగ్రత్తగా చూసుకునే వీరయ్య పాత్రలో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధానికి దర్పణంలా ఉంటుంది.
హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి అని చెప్పారు. మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వివేక్ కాలేపు, సంగీతం: చరణ్ అర్జున్, సంభాషణలు: హను రావూరి, రచన-దర్శకత్వం: శివప్రసాద్ యానాల. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 9న విడుదలకానుంది.