తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్యానెల్ విజయాన్ని సాధించింది. 2023-25 సంవత్సరానికి గానూ జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా అనిల్ కుమార్ వల్లభనేని, కార్యదర్శిగా పీఎస్‌ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికవగా, అలాగే కోశాధికారిగా పోటీ చేసిన సురేష్ గెలుపొందారు. కోశాధికారి పదవికి ఫెడరేషన్ మొత్తం ఓట్లు -72 కాగా, 60 ఓట్లు పోలయ్యాయి. అందులో సతీష్ కు -16 ఓట్లు రాగా, సురేష్ కు 44 ఓట్లు వచ్చాయి. 28 ఓట్ల మెజారిటీతో సురేష్ కోశాధికారిగా గెలుపొందారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మరోసారి మా ప్యానెల్ మీద నమ్మకం ఉంచిన సినీ కార్మికులకు కృతజ్ఞతలు. తెలుగు సినీ పరిశ్రమలోని 25 వేల మంది కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాం అన్నారు.