జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్‌దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రుద్రంగి. రసమయి ఫిలింస్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, పాటలు సినిమాపై కాస్త మంచి బజ్‌నే క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. జగపతి బాబు విలనిజం వేరే లెవల్లో ఉంది. ఇండిపెండెంట్ బానిసలకు కాదు రాజులకు, గాడు బలవంతుడురా కానీ నేను భగవంతుడిని రా అంటూ జగ్గు బాయ్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. రాణిగా తన ప్రజలకు ఓ వైపు సేవలు చేస్తూనే, వాళ్లను అణగదొక్కేవాళ్లపై ఝాన్సీ లక్ష్మీభాయ్‌లా విరుచుకుపడుతుంది. టీజర్ మొత్తం ఆసక్తికరంగా సాగింది.
స్వాతంత్ర కాలం నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులను చూపిస్తూ టీజర్ సాగింది. చారిత్రక అంశాల నేపథ్యంతో సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించామని చిత్రబృందం చెబుతున్నారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 26న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సంతోష్ శనమోని, సంగీతం : నాఫల్ రాజా ఏఐఎస్.