రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో కీలక ఒప్పదం చేసుకుంది. హర్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ (జేసీటీఎస్) మిసైల్ డీల్‌ను ఖాయం చేసుకుంది. అగ్రరాజ్యం కూడా హర్పూన్‌ను విక్రయించేందుకు సుముఖం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం విలువ సుమారు 82 మిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మద్య రక్షణ పరమైన రంగం మరింత బలోపేతం అవుతుందని భారత్ తెలిపింది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో కూడా ఇరు దేశాలు కలిసి ముందుకు వెళ్లే ఆస్కారం ఉంటుంది. క్షిపణుల అమ్మకాల గురించి పెంటగాన్ రక్షణ సహకరా ఏజెన్సీ దీనికి సంబంధించిన రిపోర్టును అమెరికా ఉభయ సభలకు చేరవేసింది. హర్పూన్‌ను కొనుగోలు చేసేందుకు భారత్ విన్నవించిందని, దానికి చెందిన లాజిస్టిక్స్ కూడా కుదిరినట్టు అమెరికా తెలిపంది. వాతావరణంతో సంబంధం లేకుండా హర్పూన్ పని చేస్తుంది. యాంటీషిప్ మిసైల్ సిస్టమ్‌ను తొలిసారి 1977లో తయారు చేశారు.