టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హైదరాబాద్ చేరకుంది.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. సింధుతో పాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా కప్పి సత్కరించారు. వచ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజయం ఎంతో మంది యువతలో స్ఫూర్తి నింపిందని అన్నారు. ఈ సందర్బంగా సింధు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండాలని చెప్పింది.