అయోధ్యలో భావ్య రామ మందిర నిర్మాణం డిసెంబర్ 2023 నాటికి పూర్తికానుంది. భక్తులందరూ డిసెంబర్ 2023 నాటికి రాముణ్ని దర్శించుకోవచ్చని రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. రామ మందిర నిర్మాణం ప్రారంభమై యేడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకొని పూజలు నిర్వహిస్తారని ట్రస్ట్ ఓ ప్రకటనలో పేర్కొంది.