Namaste NRI

అల్లరి నరేష్‌ కొత్త అవతారం.. ఉగ్రం థియేట్రికల్‌ ట్రైలర్‌  

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉగ్రం. షైన్‌స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు.విజయ్‌ కనకమేడల దర్శకుడు.  మేకర్స్థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. నగరంలో మిస్సింగ్‌ కేసుల వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అసాంఘికశక్తులు అతని కుటుంబాన్ని టార్గెట్‌ చేయడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఉత్కంఠభరితంగా సాగింది. పోలీస్‌ అధికారిగా అల్లరి నరేష్‌ తీవ్ర భావోద్వేగాలు కలబోసిన శక్తివంతమైన పాత్రలో కనిపించారు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, కథ: తూమ్‌ వెంకట్‌, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది, రచన-దర్శకత్వం: విజయ్‌ కనకమేడల. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events