నేను ఐడీ కార్డ్ ధరించి చాలా కాలం అవుతుంది. సెట్స్‌లో ఐడీ కార్డ్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ ఐడీ కార్డుతో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా రూపొందుతోన్న మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎటువంటి అంచనాలు నెలకొన్నాయో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం 2021 అక్టోబర్ 13న విడుదల కానుంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఈ మూవీ సెట్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ ఐడీ కార్డు వేసుకుని కనిపించారు. ఎన్టీఆర్ కాదు పక్కనున్న రాజమౌళి కూడా ఐడీ కార్డు వేసుకున్నారు. ఈ ఐడీ కార్డుపై నందమూరి తారక రామారావు హీరో అని ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉంది.