కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్న చిత్రం ఛాంగురే బంగారురాజా. కుషిత కల్లపు హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ హోంబ్యానర్ ఆర్టీ టీమ్‌వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ మూవీ టీజర్ ను రవితేజ లాంచ్ చేశారు. నాకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. సడెన్‌గా ముగ్గురు దొంగనా కొడుకులు నా జీవితంలోకి ఎంటరైపోయి సుఖంగా ఉన్న నా జీవితాన్ని కలగాపులగం చేసేశారు అంటూ సునీల్ వాయిస్ ఓవర్‌తో సాగుతున్న టీజర్ కొంచెం ఫన్‌గా, కొంచెం సీరియస్ ఎలిమెంట్స్‌తో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. బంగార్రాజు, తాతారావు, గాటిల్ల చుట్టూ సినిమా సాగనున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సతీష్ వర్మ కాగా, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నాడు. జనార్దన్ పసుమర్తి స్క్రీన్‌ప్లే సమకూరుస్తుండగా, శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నొరోన్హా, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఛాంగురే బంగారురాజా విడుదలకు సిద్ధమవుతోంది.