అణ్వాయుధాల కంటే కృత్రిమ మేధస్సు చాలా ప్రమాదకరమంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. తన జీవితకాలంలో ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చెందడం చూశానని, వాటిలో ఈ స్థాయి ప్రమాదం ఏదీ లేదన్నారు. కృత్రిమ మేధస్సు వ్యవస్థ భవిష్యత్‌లో మానవుడు చేయగల ఏదైనా మేధోపరమైన పనిని అర్థం చేసుకోవడంతో పాటు నేర్చుకోగలదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.