టోక్యో ఒలింపిక్స్లో పథకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్లో మన క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. 41 సంవత్సరాల తరువాత హాకీలో భారత్ పతకం సాధించడం సంతోషకరమన్నారు. అలాగే పీవీ సింధు విజయం సైతం భారత ఖ్యాతిని ముఖ్యంగా ఆడపిల్లల్లో నూతన స్ఫూర్తిని నింపిందని రాకేష్ పటేల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. విజేతలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పారితోషికాన్ని అందించి భవిష్యత్తులో వారు మరిన్ని పతకాలు తెచ్చేలా వారికి సరైన శిక్షణ ఇవ్వాలని కోరారు.