నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఘనంగా నిర్వహించారు. మే 21న జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ నగరాల నుండి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ముందుగా కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు మురళీ మోహన్, ప్రముఖ నిర్మాత అశ్వినిదత్, ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆన్లైన్లో పాల్గొని ఎన్టీఆర్ తో తమ జ్ఞాపకాలు పంచుకుని ప్రత్యక్షంగా పాల్గొన్న అందరికి శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ కార్యక్రమాన్ని నెదర్లాండ్స్ దేశంలోని ఎన్టీఆర్ అభిమాన సంఘం కార్యవర్గం సభ్యులు రామకృష్ణ ప్రసాద్, వివేక్ కరియావుల, వెంకట్ కోకా, తేజా గోయాల్లా, శ్యామ్ పంపానా, మధుకర్ రెడ్డి, సంపత్, ప్రసాద్, అమర్, నవీన్‌తో పాటు బెల్జియం నుండి వచ్చిన ఇతర అభిమానులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
