ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య ఆకర్షణగా ఇళయరాజా నిలవనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-32.jpg)
అమెరికాలోని తెలుగువారు ఎందరో ఆయన అభిమానులు…తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా తానా మహాసభల్లో కూడా తన సంగీత కచేరితో మిమ్ములను అలరించనున్నారు. సంగీత ప్రయోగాలకు పేరుగాంచి ఇళయరాజా, తన సింఫనీతో కాన్ఫరెన్స్‌కు వచ్చినవారిని అలరించనున్నారు. తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఇళయరాజాను స్వయంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇళయరాజా రాకతో కాన్ఫరెన్స్‌లో సంగీతహోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయమని అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు అంటున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-32.jpg)
ఇళయరాజా సంగీతాన్ని ప్రత్యక్షంగా వినాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇతర వివరాలకు చూడండి.
www.tanaconference.org/
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-31.jpg)