రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ ముఖ్యతారలుగా నటించిన చిత్రం లవ్ యూ రామ్. ప్రముఖ దర్శకుడు దశరథ్, డీవై చౌదరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్ కి మంచి స్పందన వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు మాట్లాడుతూ అందరికి నచ్చేలా కథ, కథనాలు ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలు అందర్ని అలరిస్తాయి. మైత్రీ మూవీస్ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు.
డివై చౌదరి మాట్లాడుతూ అందరికీ నచ్చేలా సినిమా వచ్చింది. ఇప్పటివరకూ చూసిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. పాటలకు మంచి స్పందన వచ్చింది అని తెలిపారు. హీరో రోహిత్ మాట్లాడుతూ ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు ఇది చాలా గ్రేట్ జర్నీ అని పేర్కొన్నారు. ఈ నెల 30న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.