పవన్‌కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కలయికలో రూపొందిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను నిర్వహించించారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మా మావయ్యతో కలిసి నటించే అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సముద్రఖని దర్శకుడిగా ఈ చిత్రంతో మరో మెట్టు ఎదిగాడు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పే స్థాయి నాకు లేదు. నా ఆరోగ్యం బాగ లేకపోవడంతో దర్శకుడు త్రివిక్రమ్ నాకోసం సముద్రఖనితో సంవత్సరం పాటు వెయిట్ చేయించాడు.ఈ రోజు సినిమా గొప్ప విజయం సాధించడం ఆనందంగా వుంది అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రావడం మాకు టైమ్ కలిసి వచ్చిందనే అనుకుంటున్నాం. ఈ చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ రోజు ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కారణం త్రివిక్రమ్ రచన, సముద్ర ఖని దర్శకత్వ ప్రతిభ. సాధారణంగా నేను ఏ సినిమా చేస్తున్న మధ్యలో ఫోన్ చూడటం అలవాటు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యే వరకు ఫోన్ పక్కన పెట్టేశాను అన్నారు.వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించాడు.