హైదరాబాద్‌లోని ఫంక్షన్ హాలులో జరిగిన ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ వివాహ రిసెప్షన్‌కి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూ వరులను ఆశీర్వదించారు. సీఎం కెసిఆర్‌తోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటులు శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, గరికపాటి నర్సింహరావు తదితరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. ఇటీవల బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్ధార్థ్, డాక్టర్ ఐశ్వర్య వివాహం జరిగింది.
