భారతీయులు ప్రపంచాన్ని ఏలుతున్నారు అని ట్విట్టర్ (ఎక్స్) సిఇఓ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ఎక్స్ తన వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఖాతాలో అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సిఇఓలుగా ఉన్న భారతీయుల జాబితాను షేర్ చేసింది. ఆ జాబితా మస్క్‌తో పాటుగా లక్షలాది మంది దృష్టిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ జాబితాలో భారతీయ సంతతికి చెందిన వారు సిఇఓలుగా ఉన్న 23 పప్రంచ దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.గూగుల్, అల్ఫాబెట్ కంపెనీలకు సిఇఓగా ఉన్న సుందర్ పిచాయ్, మైక్రాన్ టెక్నాలజీ సిఇఓ సంజయ్ మెహ్రోత్రా, అడోబ్ సిఇఓ శంతను నారాయన్, మైక్రోసాఫ్ట్ చైర్మన్, సిఇఓ సత్య నాదెళ్ల, ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, నెట్‌యాప్ సిఇ జార్జి కురియన్, మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.
