తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు సిడ్నీ నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ అక్రమ కేసులు, అరెస్టులతో తమ నాయకుడిని, పార్టీ కార్యకర్తలను భయపెట్టలేరని తెలిపారు. దీనికి తగిన సమాధానం రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ధ్వేయంగా చంద్రబాబు 45 ఏళ్ల పాటు మచ్చలేని రాజకీయ జీవితాన్ని గడిపారని తెలిపారు. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల అవినీతి కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ అందరూ తనలాంటి వారే అన్న భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.