Namaste NRI

సింగం ఎగైన్‌ షూటింగ్‌ ప్రారంభం

అజయ్‌ దేవగణ్‌, దీపిక పదుకొణె జోడీగా స్వీయ నిర్మాణంలో రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న కాప్‌ యూనివర్స్‌ చిత్రం సింగం అగైన్‌. సింగం ఫ్రాంచైజీలో ఇది మూడో సినిమా. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్‌ అయింది. లాంచ్‌ ఈవెంట్‌కు అజయ్ దేవ్‌గణ్‌, దర్శకుడు రోహిత్ శెట్టితో పాటు హీరో రణ్‌వీర్ సింగ్ హాజరయ్యారు. ఇక ఈ మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌లో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు అక్షయ్ కుమార్ , రణ్‌వీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సారి బడ్జెట్‌ కూడా రెట్టింపు అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సింగం-3 లో దీపికా లేడీ పోలీస్‌ అధికారిగా నటించనుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events