వరలక్ష్మీ శరత్‌కుమార్, అవికాగోర్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఓంకార్ మాట్లాడుతూ ఈ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. ప్రతి ఎపిసోడ్ సరికొత్త పాయింట్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీ అంతా చూసేలా ఉంటుంది అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ హారర్ థ్రిల్లర్ కథాంశమిది. నా క్యారెక్టర్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సిరీస్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది అని చెప్పింది. మాన్షన్ 24 సిరీస్‌కు సంగీతం: వికాస్ బాడిస, నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కల్యాణ్ చక్రవర్తి.