అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత పరిస్థితులు విషమిస్తున్న నేపథ్యంలో భారత్‌కు రావాలని కోరుకొనే అఫ్గాన్లకు అత్యవసర ఈ`వీసాలు జారీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మతంతో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్ పౌరులు ఎవరైనా సరే వీసాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఫాస్ట్ ట్రాక్ విధానంలో జారీ చేసే ఈ కొత్త వీసాను ఈ`ఎమర్జెన్సీ ఎక్స్`మిసిలేనియస్ వీసాగా వ్యవహరిస్తున్నట్టు తెలిపింది. దరఖాస్తులను ఢల్లీిలో పరిశీలించనున్నట్లు తెలిపింది. అఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వీసా నిబంధనలను కేంద్ర హోంశాఖ సమీక్షించిందని, అఫ్గాన్ పౌరులను భారత్‌లోకి అనుమతించడానికి ఎలక్ట్రానిక్ వీసా అనే కొత్త కేటరిగిని ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు. అఫ్గాన్‌లో భారత రాయబార కార్యాలయం మూతపడిరదని, అందుకే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడిరచించారు. ఈ వీసా అరు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుందన్నారు.