Namaste NRI

భారతి భారతి ఉయ్యాలో సాంగ్ లాంచ్ చేసిన మాజీమంత్రి డీకే అరుణ

బాబీ సింహ, వేదిక, అనుష్య త్రిపాఠీ, ప్రేమ, ఇంద్రజ, మకరంద్‌ దేశ్‌ పాండే ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం రజాకార్‌. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం నుంచి భారతి భారతి ఉయ్యాలో అనే పాటను రిలీజ్ చేశారు. రానున్న దసరా పండుగ సందర్భంగా ఈ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈక్రమంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.డీకే అరుణ మాట్లాడుతూ  సెప్టెంబర్‌ 17, 1948న మనకు స్వాతంత్య్రం వచ్చిందని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ సినిమా ద్వారా అందరికీ తెలుస్తుందన్నారు.

దర్శకుడు యాటా సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పుడు బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి.మా పాట, ఆటలో ఆనందం ఉంది, ఆనందంలో ఆవేదన ఉంది. పండుగలోనే పాట ఉంది.. పాటలోనే కష్టం ఉంది. అవన్నీ చెప్పే అదృష్టం రజాకార్ చిత్రంతో దొరికింది. ఇది వాస్తవంగా జరిగిన కథ అని తెలిపారు.  అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ రజాకార్ సినిమాలో భారతీ భారతీ ఉయ్యాల పాటకు ఓ నేపథ్యం ఉంటుంది. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చి పండుగ జరుపుకుంటుంటే, ఇక్కడ మాత్రం రజాకార్లు మన జెండాను ఎగరవేస్తే చంపేస్తారు. ఆ సందర్భంలో ఈ పాట వస్తుంది అని అన్నారు.

అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ రజాకార్ సినిమాలో నేను సగటు మహిళగా నటించాను. నిజం చెప్పేందుకే ఈ సినిమాను తీశారు. ఇది కల్పిత కథ కాదు. ఇలాంటి ఓ సినిమాలో ఓ పాటను చేశాను అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుష్య త్రిపాఠి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress