పాలస్తీనియన్లపై దురాక్రమణను ఇజ్రాయెల్ తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంతంలోని అన్ని పార్టీలూ సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వెల్లడించారు. గాజాపై ఇజ్రాయెల్ దురాక్రమణ ఆపకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయంటూ గట్టి హెచ్చరికలు చేశారు. యుద్ధ పరిస్థితిని నియంత్రిస్తామని, ఘర్షణలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చూస్తామని ఎవరూ హామీ ఇవ్వలేరని వ్యాఖ్యానించింది. యుద్ధాన్ని ఆపాలన్న ఆసక్తి ఉన్నవారు, గాజాలో పౌరులపై జరుగుతున్న అనాగరిక దాడులను నిరోధించాలని అమెరికాను ఉద్దేశిస్తూ పరోక్షంగా విమర్శలు గుప్పించింది. గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.