అమెరికా క్యాపిటల్ హిల్‌లోని కాంగ్రెస్ గ్రంథాలయం వద్ద బాంబులతో కూడిన ఒక వాహనం ఉండటం కలకలం రేపింది. దీంతో ఆ భవనాన్ని క్యాపిటల్ హిల్ పోలీసులు ఖాళీ చేయించారు. చట్టసభ్యులు, ఇతర సిబ్బంది, ప్రజలను అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలని సూచించారు. క్యాపిటల్ హిల్ ప్రాంతాన్ని పోలీసులు మూసి వేశారు. వాహనంలో ఉన్నవి పేలుడు పదార్థాలేనా, అందులో ఉన్న వ్యక్తి వద్ద డిటోనేటర్ ఉన్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులతో పాటు ఎఫ్‌బీఐ, ఆల్కహాల్, పొగాకు, తుపాకులు, పేలుడు పదార్థాల బ్యూరోలకు చెందిన సిబ్బంది కూడా అక్కడకు చేరుకున్నారు.