గాయం కారణంగా వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌తో పాటు ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైన టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కాలి గాయం తిరగబెట్టడంతో ఈ ఏడాది కోర్టులో అడుగుపెట్టబోనని వెల్లడిరచారు. నన్ను క్షమించండి. గాయం కారణంగా 2021 సీజన్‌కు దూరమవుతున్నా. ఏడాది కాలంగా గాయంతో బాధపతుడున్నా. దీనివల్ల ఎన్నో ముఖ్యమైన టోర్నీలకు దూరం కావాల్సి వచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్లో జకో చేతిలో ఓటమి తర్వాత ఈ స్పెయిన్ స్టార్ వింబుల్డన్‌తో పాటు ఒలింపిక్స్ నుంచి కూడా వైదొలిగాడు. ఫెదరల్ కూడా గాయం కారణంగా కొన్ని నెలల పాటు టెన్నిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.