Skip to main content

Namaste NRI

సుధీర్ బాబు హరోం హర టీజర్‌ రిలీజ్

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం హరోం హర. జ్ఞానసాగర్‌ దర్శకుడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను అగ్ర హీరోలు ప్రభాస్‌, మమ్ముట్టి, టైగర్‌ ష్రాఫ్‌, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్‌ వివిధ భాషల్లో విడుదల చేశారు. హీరోని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. యుద్ధ భూమిలో విజయమే లక్ష్యంగా పోరాడాలనే స్ఫూర్తితో టీజర్‌ ఆకట్టుకుంది. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ శక్తిగా హీరో ఎదిగే వైనం ఆసక్తికరంగా ఉంటుందని, ద్వారకా నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో మాళవిక శర్మ, సునీల్‌, జేపీ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ విశ్వనాథన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారక.

Social Share Spread Message

Latest News