రష్యాపై తన పట్టును కొనసాగించాలని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నారు. 2024లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారని రష్యన్ మీడియా తెలిపింది. ఆయన రష్యాలో దాదాపు 25 ఏళ్ల నుంచి అధికారం చలాయిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో వేలాది మంది రష్యన్లు ప్రాణాలు కోల్పోవడం, క్రెమ్లిన్ సహా దేశంలో అనేక దాడులు జరగడం వంటివేవీ ఆయన ప్రాబల్యాన్ని తగ్గించలేదు. ఇప్పటికీ ఆయనకు మద్దతు అధికంగానే కనిపిస్తున్నది. జూన్‌లో కిరాయి సైన్యం తిరుగుబాటు చేసినప్పటికీ, రష్యాపై పుతిన్ పట్టు సడలలేదు.