ఖతర్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖతర్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది తెలుగు ప్రవాసీయులు రక్తాన్ని దానం చేసినట్లుగా తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు పేర్కొన్నారు. తమ సంఘం చేపడుతు న్న రక్తదాన కార్యక్రమం సహా వివిధ సామాజిక సేవా కార్యక్రమాల గురించి మధు ఈ సందర్భంగా వివరించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ ఎంబసీ ప్రథమ కార్యదర్శి, ప్రవాసీయు ల సంక్షేమ వ్యవహారాలను చూసే డాక్టర్ వైభవ్ తండలే రక్తదానంపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రత్యేక అతిథులు గా పాల్గొన్న ఐ.సి.బి.యఫ్ అధ్యక్షులు షానవాజ్ బావా, ఐసీసీ ఉపాధ్యక్షులు సుబ్రమణ్యంలు మాట్లాడుతూ ఖతర్‌లోని భారతీయ సేవ కార్యక్రమాలలో గల్ఫ్ తెలంగాణ సమితి క్రియాశీలకంగా ఉండడాన్ని ప్రశంసించా రు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు కోడూరి ప్రసాద్ కూడా సేవ గుణం ఔన్నత్యం గురించి వివరించారు. రక్తదాత లకు, రక్తదాన శిబిర నిర్వాహకులకు ప్రశంసాపత్రాలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో ఐసీబీయఫ్ కమిటీ సభ్యులు వార్కే భోబన్, కుల్దీప్ కౌర్, మహమ్మద్ కొనిలతో పాటు శంకర్ గౌడ్, అబ్దుల్ రవూఫ్, కుల్విందర్ సింగ్, మోహన్ కుమార్, నందిని అబ్బగోని, సుధా, ప్రవీణా, శ్రీధర్ అబ్బగోని, గడ్డి రాజు, మను, సాగర్, సంజీవ్, సంధ్యారాణి, ప్రియా, సుధాకర్, ఎల్లయ్య, శోభన్ గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.