వైభవంగా అమ్మ నాన్న గురువు పద్యార్చన- తెలుగు భాష, సాహిత్య సాంస్కృతిక,సామాజిక ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించింది తానా.
ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యా విద్యార్థులతో సామూహిక పద్యగానం నిర్వహించింది తానా అమ్మ మీద అనురాగం, నాన్న మీద గౌరవం గురువు మీద భక్తి ప్రకటించేలా గొంతులెత్తి లక్షలాది మంది విద్యార్థులు పద్యాలు పాడారు.గుండెల నిండా అభిమానంతో అక్షరతాండవం చేశారు.అద్భుతమైన దృశ్యాలు అవని సీమపైన ఆవిష్కరించారు.డిసెంబర్ 18, 2023న ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ బృహత్ కార్యక్రమం తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారు, తానా పూర్వ అధ్యక్షులు,వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళూరి నేతృత్వంలో జరిగింది.
చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాల్లోని పద్యాలను కంఠస్థం చేసి ఎవరి పాఠశాలల్లో వారు సామూహిక గానం చేశారు. పంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులు, అమెరికాలోని తానా పాఠశాల విద్యార్థులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కార్పోరేట్ పాఠశాలల విద్యార్థులు, ఇతర ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు, విశ్వ విద్యాలయాల విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
చిగురుమళ్ళ శ్రీనివాస్ వందేవిశ్వమాతరమ్ పేరుతో 100 దేశాల్లో నిర్వహిస్తున్న శాంతి సద్భావనా యాత్రలో భాగంగా అమ్మ నాన్న గురువు శతక పద్యార్చన నిర్వహింపబడింది.