అమెరికాలో స్థిరపడిన తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడికి అరుదైన గౌరవం లభించింది. వైద్య వృత్తిలో చేసిన విశేష సేవలు గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లికి చెందిన ఆయన ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్నారు. అమెరికాలోనే ప్రముఖ గుండె వైద్య నిపుణుడిగా ఖ్యాతి గడిర చారు. 1968లో అమెరికా వెళ్లిన ఆయన గుండె సంబంధిత రోగుల కోసం 300 పడకల ఆస్పత్రిని నిర్మించారు. ఆయన సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యుడిగా నియమిం చింది. ఆయన సోదరుడు రాజశేఖర్ నాయుడు కూడా అమెరికాలోనే స్థిరపడి పారిశ్రామిక వేత్తగా ఎదిగారు.