విశ్వక్సేన్ కథానాయకుడిగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గామి. చాందిని చౌదరి కథానాయిక. కార్తీక్ శబరీశ్ నిర్మాత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వసేన్ మాట్లాడారు. దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రీసెర్చ్ చేశాడు. ప్రతి ఎలిమెంట్‌నీ లోతుగా అధ్యయనం చేసి రాసుకున్నాడు. దాదాపు నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాం. ఇంత సమయం తీసుకున్నాం కాబట్టే మంచి సీజీని రాబట్టుకోగలిగాం అన్నారు. వారణాసిలో ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఫలక్నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడ్ని. ఈ నాలుగున్నరేళ్లలో చాలా సినిమాలు చేసేశాను. నా కెరీర్లో ఇది స్పెషల్ మూవీ. కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ చేశాం. కొందరు నేను అఘోర అనుకొని ధర్మం చేశారు.
వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూలన కూర్చున్నప్పుడు ఓ ముసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. ఇలా ఎన్నో అనుభవాలు. ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. సినిమా కూడా నచ్చుతుందని అనుకుంటున్నా అన్నారు. విశ్వక్సేన్. మానవస్పర్శే సమస్యగా మారిన ఓ అఘోరా హిమాలయాల్లో చేసే సాహసోపేత ప్రయాణ మే ఈ సినిమా అని , అఘోర శంకర్‌గా ఇందులో విశ్వక్సేన్ అద్భుతంగా నటించాడని దర్శకుడు విద్యాధర్ చెప్పారు. మార్చి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: నరేశ్ కుమారన్, కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి.