పాకిస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. వారం రోజుల హై టెన్షన్‌కు.. రెండు పార్టీలు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పీపీపీ, పీఎంఎల్-ఎన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇస్లామాబాద్ లోని జర్దారి ఇంట్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంకీ ర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పీపీపీ, పీఎంఎల్-ఎన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంయుక్త మీడియా సమావేశంలో పీపీ పీ చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ మా ట్లాడుతూ పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (72) మళ్లీ ప్రధాని పదవిని చేపడతారని చెప్పారు. పీపీపీ కో-చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ (68) దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిపారు.