ఉద్యోగ నిమిత్తం సింగపూర్ లో నివాసం ఉంటున్న విజయవాడ కు చెందిన ప్రదీప్ కుమార్ వంగపండు (32) ఫిబ్రవరి 3 వ తేదీన గుండె సంబంధిత వ్యాధి (cardiomegaly) తో మృతి చెందాడు. ఆయన సింగపూర్ లో గత 8 సంవత్సరాలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే వారు. ఆయనకు గత మూడు సంవత్సరాల క్రితమే సంబంగి లావణ్య చే వివాహం జరిగింది. ఈ మరణ వార్త తో ఆయన భార్యా, తల్లి తండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. అయితే ఆయన భార్య లావణ్య గారికి చిన్నతనం లోనే తల్లిదండ్రులను కోల్పోవడం మరియు ప్రదీప్ తల్లిదండ్రులకు కొడుకు కోల్పోవడంతో ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక ఆధారం కోల్పోయినట్లయింది. ఈ కష్ట సమయం లో ఈ విషయం తెలుసుకు న్న ఇక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) సభ్యులు మానవతా దృక్పథం తో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేయడానికి పిలుపునివ్వగా ముందుకు వచ్చి సహాయం చేసిన దాతలకు సంస్థ సభ్యులు కృతజ్ఞతలు తెలియ జేశారు. ఈ కష్ట సమయం లో వారికి కి తోడుగా ఉన్న ప్రదీప్ బావ వెంకట సురేష్ ఉగ్గిన గారితో మాట్లాడి ఆ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం చందాల ద్వారా వచ్చిన 3,28,000 రూపాయలను మృతుడు ప్రదీప్ తల్లిదండ్రుల ఖాతా లో 1,64,000/- మరియు భార్య లావణ్య గారి ఖాతా లో 1,64,000/- జమ చేయడం జరిగింది. సాయం అందించిన దాతలకు ప్రదీప్ కుటుంబ సభ్యులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరపున సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ మొదలగు వారు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ విషయాన్నీ సొసైటీ దృష్టికి తీసుకువచ్చి చందాల సేకరణ కు సమయాన్ని వెచ్చించిన సొసైటీ కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల మరియు మణికంఠ రెడ్డి గారికి మరియు స్థానిక వాట్సాప్ సమూహాలలో షేర్ చేస్తూ ప్రాచుర్యం కలిగించడం లో ముఖ్య పాత్ర పోషించిన సంతోష్ వర్మ మాదారపు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.