శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉడాన్ పథకంలో భాగంగా స్టార్ ఎయిర్‌లైన్స్ సంస్థ వారానికి మూడు రోజులు ఇక్కడి నుంచి సర్వీసులు నడపనుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఎయిర్ కనెక్టివిటి అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఉడాన్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులోకి తెచ్చినట్లు జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. మంగళ, గురు, శనివారాలు ప్రతిరోజూ ఉదయం 3:20 గంటల ఇక్కడి నుంచి స్టార్ ఎయిర్ ఓజీ`149 విమానం ఇక్కడి నుంచి బయలు దేరి సాయంత్రం 5:20 గంటలకు జామ్‌నగర్ విమానాశ్రయానికి చేరుకుంటుంది. జామ్‌నగర్‌కు స్టార్ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులే నడుస్తాయి.