ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడాన్ని మెరుగైన మార్గంలో ప్రణాళిక చేసి ఉండవచ్చు కానీ, అమెరికా వెనక్కి తగ్గిన తీరుపై దర్యాప్తు చేయాలని అమెరికాకు చెందిన ఎంపీ రాజా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా తన ప్రచారాన్ని కొనసాగించడమే మంచిదన్నారు. ఈ ప్రచారంలో భారత్ అమెరికాతో కలిసి పోరాడగలదని అన్నారు. రెండు దేశాల ప్రయత్నాలతో హింసకు గురైన ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గంగా మారదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసిస్, అల్`ఖైదా వంటి తీవ్రవాద మూలాలున్న సంస్థల అభివృద్ధికి నిరంతరం ముప్పు ఉన్నందున బలగాలను ఉపసంహరించకుండా ఉండాల్సిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారకుండా అమెరికా ప్రభుత్వం చూడాలని ఆయన సూచించారు.