సిరియా రాజధానిలోని తమ దేశ రాయబార కార్యాలయంపై జరిగిన దాడికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు ఇరాన్ జనరల్స్ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసరంగా సమావేశమైన ఇరాన్ జాతీయ భద్రతా మండలి, ఇజ్రాయెల్ దాడులకు తగిన బదులివ్వాలని నిర్ణయించి నట్టు ఆ దేశ ప్రభుత్వ వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్‌పై ఇరాన్ నేరుగా తలపడుతుందా అన్నదానిపై స్పష్టతలేదు.