Skip to main content

Namaste NRI

బెస్ట్ ఎన్‌ఆర్‌ఐగా కాసర్ల నాగేందర్ రెడ్డి

ఆస్ట్రేలియాలో ఎఎ మీడియా హౌస్ నిర్వహించిన సర్వేలో భారతీయులు వేసిన ఓట్లలో అత్యధిక ఓట్లు సాధించి ఉత్తమ కమ్యూనిటీ లీడర్‌గా కాసర్ల నాగేందర్ రెడ్డి ఎంపికయ్యారు. మిగతా విభాగాలతో పోలిస్తే ఉత్తమ కమ్యూనిటీ లీడర్ విభాగంలో నాగేందర్ ఎక్కువ ఓట్లు పొందారు. ఉత్తమ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ విభాగంలో నల్గొండకు చెందిన సురేందర్ రెడ్డి తిమ్మాపురం, ఉత్తమ మహిళా నాయకురాలు విభాగంలో తెలుగు దేశం పార్టీకి చెందిన సుమ తాటినేని అత్యధిక ఓట్లతో విజేతలుగా నిలిచారు.

ప్రతీ విభాగంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కమ్యూనిటీ లీడర్ విభాగంలో నాగేందర్ రెడ్డికి లభించిన అధిక సంఖ్యలో ఓట్లు, ఆయనకు ఆస్ట్రేలియాలోని భారతీయులలో ఉన్న విశ్వాసాన్ని, అభిమానాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఈ అవార్డు ప్రదానం చేసిన ఆస్ట్రేలియా లేబర్ పార్టీ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు బ్రాడ్ పాట్టిన్ తెలిపారు.  ఈ అవార్డు ప్రధానంలో భారత హై కమిషనర్, భారతీయ సంఘాల నాయకులు, ప్రజలు అత్యధికంగా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events