Skip to main content

Namaste NRI

దుబాయిలో వైభవంగా గామా అవార్డ్స్‌ వేడుకలు

ప్రతిష్టాత్మక గామా (గల్ఫ్‌ అకాడమీ మూవీ అవార్డ్స్‌) పురస్కారాలకు సర్వత్రా మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా వైభవ్‌ జ్యువెలర్స్‌ సమర్పణలో 5వ ఎడిషన్‌ గామా వేడుకలు దుబారులోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్‌ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్‌ చైర్మన్‌ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్‌ కేసరి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ అవార్డుల వేడుక జరిగింది.గామా అవార్డ్స్‌ 2025 జ్యూరీ చైర్‌ పర్సన్స్‌ దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, సంగీత దర్శకులు కోటి, దర్శకులు బి.గోపాల్‌ వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్‌ కళాకారులకు, సినిమాలకు గామా  అవార్డులను బహుకరించారు.

Social Share Spread Message

Latest News